హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్‌లో కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు పలు ఉద్రిక్తపరిస్థితుల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. అయితే, రేవంత్‌ రెడ్డి అరెస్టుని అక్రమంగా పేర్కొంటూ, ఆనాటి అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో గతంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 


హైకోర్టులో సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు రాగా.. రేవంత్‌ రెడ్డి అరెస్ట్ అక్రమం అని నిరూపించడానికి సరైన ఆధారాలను చూపించలేదని పేర్కొంటూ హై కోర్టు పిటిషన్‌‌ను కొట్టివేసింది.