నిజామాబాద్ బహిరంగలో ప్రధాని మోడీ ఉద్దేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ పాలనపై కేసీఆర్ కుటుంబ పెత్తనాన్ని ప్రశ్నించారు. అభివృద్ధిపై విశ్వాసం ఉంచే వారు..  నవ తెలంగాణ కోరుకునే ప్రజలు బీజేపీతో వెంట ఉంటారని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లో పర్యటించిన తనకు మరో రాష్ట్రం తెలంగాణలో పర్యటించే అవకాశం వచ్చిందని.. ఈ నేలపై అడుగుపెట్టడం గర్వంగా భావిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క రోజులో సాధ్యపడలేదు. ఇది ఏళ్ల తరబడి చేసిన పోరాట పలితం.. యువకుల బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని అమరవీరులను ఈ సందర్భంగా మోడీ కొనియాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే ; ఇవి రెండూ కుటుంబ పార్టీలే 


కేసీఆర్ ను నమ్మి తెలంగాణ  ప్రజలు ఆయనకు పగ్గాలు అప్పగిస్తే ఆయన కుటుంబానికి తప్పితే ప్రజలుకు చేసిందేమి లేదన్నారు. తెలంగాణ ప్రజలస్వప్నాన్ని నిజం చేయడంతో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని మోడీ విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో పైసా పైసా లెక్క చెప్పాలని ప్రధాని మోడీ డిమాండ్ చేశారు. 50 ఏళ్లు ఇక్కడ పాలన చేసిన కాంగ్రెస్.. తెలంగాణకు చేసింది ఏమీ చేయలేదు. కాంగ్రెస్ విధానాలనే  కేసీఆర్ అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలా కుటుంబపాలన కొనసాగించాలని కేసీఆర్ చూస్తున్నారు..పరిస్థితి మారింది.. ప్రజల బాగోగులు పట్టించుకోకుంటే ఎంతటి వాళ్లనైనా తెలంగాణ ప్రజలు గద్దె దించుతారనే విషయంలో ఈ ఎన్నికల్లో తేల్చుతారని మోడీ వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలు వినియోగించుకోని దారుణ స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ ను ప్రధాని మోడీ ఎద్దేవ చేశారు.