తెలంగాణలోని యాదాద్రి- భువనగిరి జిల్లా రాజాపేట ప్రాంతంలో ఏడుగురు కుటుంబ సభ్యులు బిర్యానీ తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదైంది. తొలుత ఏ విధంగా కుటుంబీకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న కోణంలో పోలీసులు ఆలోచించగా.. వారి దృష్టి సంఘటనా స్థలంలో లభించిన ఆహారం పాకెట్ పై పడింది. ఆ ఆహార పదార్థాలను పరీక్షకు పంపించి అందులో క్రిమిసంహారక మందులు కలిపినట్లు కనుగొన్నారు పోలీసులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డి బాలరాజు (44 సంవత్సరాలు) అనే వ్యక్తి తన భార్య తిరుమల (39), కుమార్తె శివాని (14), కుమారుడు చింటూ (12) తో పాటు తల్లిదండ్రులు బాలనరసయ్య (65), భారతమ్మ (60)తో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు పోలీసులు. గతకొంత కాలంగా రాజాపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం స్థానిక కోళ్ళ ఫారంలో దినసరి వేతగాళ్ళుగా పనిచేస్తున్నారని సమాచారం.


ఈ ఆత్మహత్యను అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. బాలరాజు కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.