Telangana high court on drunken drives: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించే సమయంలో ఎవరైనా వాహనదారులు మద్యం తాగినట్టు గుర్తిస్తే... ఎట్టిపరిస్థితుల్లోనూ వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తరపున ఆ వాహనాన్ని తీసుకునేందుకు ఎవ్వరూ రాని పక్షంలో వారి వాహనాన్ని పోలీసు స్టేషన్‌కి తరలించి, ఆ తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేయాలని హై కోర్టు (Telangana high court) సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్యం మత్తులో ఉన్న వారు వాహనం నడపడానికి అనుమతించేందుకు వీల్లేదని చెప్పిన హై కోర్టు (TS high court).. వారి వెంట ఎవరూ లేని పరిస్థితుల్లో, వారి సన్నిహితులను పిలిపించి వాహనం అప్పగించాలని ఆదేశించింది.


డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల (Drunken drive check) సందర్భంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్ర హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.