Teenmar Mallanna says Wherever CM KCR contests I will contest there: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేస్తే.. తాను అక్కడే చేస్తా అని తీన్మార్‌ మల్లన్న అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండు మూడు రోజుల్లోనే.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సమాచారం తమకు ఉందని చెప్పారు. అవినీతిపై పోరుతో తీన్మార్‌ మల్లన్న ‘7200 ఉద్యమ పాదయాత్ర' చేపట్టిన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ పాదయాత్రకు అనుమతులు నిరాకరించడంతో బుధవారం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మల్లన్న తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాదయాత్రలో భాగంగా బుధవారం తీన్మార్‌ మల్లన్న సత్తుపల్లిలోని జేవీఆర్‌, కిష్టారం ఓసీల్లో పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ... 'అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన 2-3 రోజుల్లోనే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సమాచారం మాకు ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేసినా.. నేను అక్కడ పోటీ చేస్తా. మల్లన్న బృందం రూపాంతరం చెంది రానున్న రోజుల్లో రాజకీయ పార్టీగా మారనుంది' అని అన్నారు. 


'నవంబర్‌ 26న భద్రాచలంలో ప్రారంభమైన పాదయాత్ర 100 కిలోమీటర్లు విజయవంతంగా కొనసాగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడే నన్ను ప్రజల్లో తిరగనీయకుండా.. పోలీస్‌ వ్యవస్థ ద్వారా అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. కేసీఆర్‌ రాజ్యంలో పాదయాత్రలు చేయాలంటే.. న్యాయస్థానాల అనుమతి పొందాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పాడ్డాయి. పాదయాత్రలో నా ప్రసంగాలతో గొత్తికోయలంతా మావోయిస్టుల్లో చేరతారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంతకాలం నేను ఇచ్చిన ప్రసంగాలతో ఎంత మంది మావోయిస్టుల్లో చేరారో చెప్పండి. ఈ విషయంపై న్యాయ బృందం ద్వారా హైకోర్టును ఆశ్రయిస్తా' అని తీన్మార్‌ మల్లన్న పేర్కొన్నారు. 


Also Read: Gujarat Assembly Election 2022: గుజరాత్‌ తొలి దశ పోలింగ్‌ నేడే.. బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్ మధ్య పోటీ!  


Also Read: Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.