KCR Speech in Kollapur: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమం ముగించుకున్న అనంతరం ఇవాళ సాయంత్రం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కొల్లాపూర్ నియోజకవర్గంపై పలు ప్రత్యేక వరాలు గుప్పించారు. కొల్లాపూర్ సభా వేదికపై నుండి సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, కొల్లాపూర్ వెనుకబడిన ప్రాంతమని.. అందుకే కొల్లాపూర్ అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక నిధి నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొల్లాపూర్ ప‌ట్ట‌ణాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్ర‌త్యేక ఫండ్‌ నిధులను ఉపయోగించుకుని బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. వెనుకబడిన కొల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు సరైన విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఒక ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేస్తాం అని స్పష్టంచేసిన సీఎం కేసీఆర్... అలాగే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద‌గా ఇంజినీరింగ్ కాలేజీలు లేవు కనుక మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోనూ జేఎన్‌టీయూ ద్వారా ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు. 


పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇక్కడి ఆయకట్టు రైతుల కోసం రెండు, మూడు లిఫ్ట‌ులు కావాలనే డిమాండ్ ఉంది. జిల్ దార్ తిప్ప లిఫ్ట్, బాచారం హై లెవ‌ల్ కెనాల్, ప‌సుపుల‌ బ్రాంచ్ కెనాల్ వైడెనింగ్, లైనింగ్, మ‌ల్లేశ్వ‌రం మినీ లిప్ట్ కావాల‌ని ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వినతులు వచ్చాయి. ఇక్కడి ఇర్రిగేషన్ అధికారుల చేత స‌ర్వే చేయించి త‌ప్ప‌కుండా మంజూరు చేస్తాను అని రైతులకు హామీ ఇచ్చారు. రూ. 10 కోట్ల‌తో బోడ‌గ‌ట్టు చెక్ డ్యాంకు సంబంధించిన జీవో రేపే జారీ చేస్తాం అని చెప్పారు. 


కొల్లాపూర్ నియోజకవర్గం సర్పంచ్‌లకు ప్రత్యేక నిధులు
కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సర్పంచ్‌లకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మరో గుడ్ న్యూస్ చెప్పారు. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోని గ్రామాల అభివృద్ధి కోసం ఒక్కో గ్రామ‌ పంచాయ‌తీకి రూ. 15 ల‌క్ష‌ల చొప్పున ప్ర‌త్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నాను అంటూ సర్పంచ్‌లకు తీపి కబురు అందించారు. 


ఇది కూడా చదవండి : CM KCR Speech from Kollapur: ఇంతకాలం గత్తర బిత్తర నాయకులు అడ్డం పడ్డారు.. పాలమూరు సభలో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్


పాలమూరుది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే..
తనను ఎంపీగా గెలిపించి, తెలంగాణ‌ సాధించుకునే అవకాశం ఇచ్చినందుకు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా అంటే తనకి ఎప్పుడూ ప్రత్యేకమేనని.. అందుకే ఇక్కడ ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 1000 చొప్పున‌ ఎక్కువ ఇండ్ల ఇవ్వదల్చుకున్నానని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీచేసినట్టు తెలిపారు. పాలమూరు అంటే తనకి ఎప్పుడూ ప్రత్యేకమేననని చెప్పిన సీఎం కేసీఆర్.. పాలమూరు బిడ్డల ఆశీర్వాదం కూడా తనపై ఎప్పటికీ ఉండాలని విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండి : CM KCR at Palamuru project: నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద మహా బాహుబలి మోటార్స్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి