Ponguleti Tears: కంటతడి పెట్టిన పొంగులేటి.. మంత్రిగా ఉండీ కాపాడలేకపోయానని భావోద్వేగం
Ponguleti Srinivas Reddy Tears On Floods: తాను మంత్రిగా ఉండి ఇద్దరి ప్రాణాలు కాపాడలేకపోయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వరదలో కొట్టుకుపోయిన ఇద్దరిపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
Ponguleti Srinivasa Reddy: భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జలదిగ్భంధంలో మునిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాగులో చిక్కుకుని ఇద్దరు కొట్టుకుపోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. వారిని కాపాడలేకపోయామని కన్నీటిపర్యంతమయ్యారు.
Also Read: Network Collapse: ఫోన్లు, మెసేజ్‌లు బంద్.. వర్షాలతో కుప్పకూలిన మొబైల్ నెట్‌వర్క్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన యాకూబ్, అతడి భార్య సైదా వరదల్లో చిక్కుకున్నారు. ఇటుక పని చేసుకునే వారిద్దరూ వరదలో కొట్టుకొనిపోయారని తెలిపారు. ఆ కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదంటూ ఆవేదన చెందారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కన్నీరు పెట్టేసుకున్నారు. యాకూబ్ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయిందని సమాచారం అందడంతో వారిని భగవంతుడే కాపాడాలని తెలిపారు.
Also Read: Telangana Heavy Rains: భారీ వర్షాలు.. అత్యవసరమైతే చేయాల్సిన ఫోన్ నంబర్లు ఇవే!
ముగ్గురిలో ఒకరిని కాపాడగలిగామని.. అన్ని ఉన్నా వాతావరణం అనుకూలించక రక్షించుకోలేకపోయానంటూ పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడేందుకు చేయని ప్రయత్నం లేదు. హెలికాప్టర్‌ల కోసం ప్రయత్నం చేశాం. భారీ వర్షాలకు హెలికాప్టర్లు టేకాఫ్ కావడం కష్టమన్నారు. ఈక్రమంలో యాకూబ్‌తో పాటు ఆయన భార్య సైదాకు ధైర్యం చెబుతూనే ఉన్నా. డ్రోన్ ద్వారా ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇంతలోనే భారీ వరద పోటెత్తడంతో వారిద్దరూ వరదలో కొట్టుకుపోయారు' అంటూ మంత్రి వాపోయారు.
యాకూబ్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సంఘటనతో రాష్ట్రంలో ఎవరూ కూడా వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అధికార యంత్రాంగం కూడా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter