Electricity Demand In Hyderabad: వేసవి కాలం భారీ ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకపోతే క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మ‌ధ్నాహ్నాం 4053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధికమించడం విశేషం. గతేడాది ఏప్రిల్ 18న గరిష్ట డిమాండ్ 3471 మెగావాట్లు మాత్ర‌మే ఉండగా.. ఈసారి భారీగా పెరిగింది. గతేడాదితో కంటే 582 మెగా‌వాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగినా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?


అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖకు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు అభినందనలు తెలిపారు. రానున్న మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. విద్యుత్ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ.. ఇదేవిధంగా సేవలు అందించి వినియోగదారుల మన్ననలు  పొందాలని సూచించారు.


రాష్ట్రంలో గ‌తేడాది ప్ర‌స్తుత ఏడాది విద్యుత్ స‌ర‌ఫ‌రా వివ‌రాలు: 


==> మార్చి 2023 సగటు డిమాండ్ 13966 మెగావాట్లు.. వినియోగం 274.42 MU


==> ఏప్రిల్ 2023 సగటు డిమాండ్ 11781 మెగావాట్లు.. వినియోగం 233.06 MU 


==> మార్చి 2024 సగటు డిమాండ్ 14534 మెగావాట్లు, వినియోగం 289.71 MU


==> ఏప్రిల్ 2024 సగటు డిమాండ్ 12429 మెగావాట్లు, వినియోగం 256.11 MU


విద్యుత్ అవసరానికి అనుగుణంగా సరఫరాను అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. గత మూడేళ్లతో పోలిస్తే.. ఈ ఏడాది 16 నుంచి 20 శాతం వరకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరిస్తూ.. అంచనాలకు మించి డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు.


Also Read: 4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook