Ponguleti Srinivas Reddy: మా పార్టీలోకి రండి.. పొంగులేటికి కేఏ పాల్ బంపర్ ఆఫర్..!
KA Paul on Poguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలోకి రావాలని కేఏ పాల్ కోరారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తే.. పొంగులేటిని డిప్యూటీ సీఎంను చేస్తానని ఆఫర్ ఇచ్చారు. పార్టీలో ఎప్పుడు చేరతారో చెబితే.. లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు.
KA Paul on Poguleti Srinivas Reddy: బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ చేరతారా..? లేదా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా..? అనే విషయంపై సందిగ్ధం నెలకింది. మరో వారం రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా బీఆర్ఎస్‌ను ఓడించే పార్టీలోనే చేరతానని పొంగులేటి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలోకి రావాలని కోరారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్ పెద్ద డ్రామా అని.. ఐదేళ్లు చంద్రబాబుకు అమిత్ షా పర్మిషన్ ఇవ్వలేదన్నా కేఏ పాల్. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చనిపోవడానికి కారణం చంద్రబాబునేనని ఆరోపించారు. చంద్రబాబు ఇక తప్పించుకోలేడని.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ మృత్యువే ఉంటుందన్నారు.
"40 ఏళ్లలో ఇలాంటి రైలు ప్రమాదం జరగలేదు. రైలు ప్రమాదంపై బాధ్యత వహించి మోడీ రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నారు. కాంగ్రెస్ దేశమంతా ఓడిపోయింది. ఎక్కడా కాంగ్రెస్ గెలవట్లేదు.. గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. కర్ణాటకలో అందరం సపోర్ట్ చేస్తే గెలిచారు. అది చూసి తెలంగాణలో అధికారంలోకి వస్తామని అంటున్నారు. పల్లె నుంచి పోయి 197 దేశాలకు సలహాలు ఇచ్చి.. నా దేశం అభివృద్ధి చేద్దామని వచ్చా.
Also Read: TDP-BJP Alliance: టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చేసిన బండి సంజయ్..!
పొంగులేటి, జూపల్లి కృష్ణారావు మిగతా నేతలు కలిసి ఇండిపెండెంట్‌గా పార్టీ పెడితే ఒక్క సీటు గెలవలేరు. కాంగ్రెస్ ఇంకో 50 ఏళ్లు ఉన్నా అధికారంలోకి రాలేదు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి 17 మంది నేతలు నన్ను ప్రధాని అవుతారని సపోర్ట్ చేస్తామన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా పార్టీలోకి రండి. నేను ఆరు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేస్తా.. జాయిన్ ఎప్పుడు అవుతారో చెప్పండి.. లక్ష మందితో మీటింగ్ పెడతా. పొంగులేటికి బీసీలు ఓట్లు వేయరు. మా పార్టీలో చేరితే పొంగులేటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా.." అని కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి