Konda Surekha about Samantha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా తనపై ట్రోలింగ్ చేశారంటూ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సినీ సెలబ్రిటీలను కూడా ఈ వివాదంలోకి లాగుతూ సంచలనం సృష్టించింది.ముఖ్యంగా నాగచైతన్య - సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ సోషల్ మీడియా వేదికగా బహిరంగ ప్రకటన చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అవుతూ ట్వీట్ వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్లకు పోస్ట్ చేసి సూటిగా ప్రశ్నించారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపు? జస్ట్ ఆస్కింగ్ ..అంటూ కొండా సురేఖ వీడియో  పెడుతూ ప్రకాష్ రాజ్ ఈ విధంగా ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ పై నెటిజనులు పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


మీకు కేటీఆర్ తో గొడవ ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ సంబంధం లేని సెలబ్రిటీలను ఇందులోకి లాగడం కరెక్ట్ కాదు అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ప్రకాష్ రాజ్ వేసిన ట్వీట్ నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం. 


ఇక నిన్న మొన్నటి వరకు తిరుమల శ్రీవారి లడ్డు వివాదం పై పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను పక్కనపెట్టి తెలంగాణ పాలిటిక్స్ పైన ఆయన ప్రశ్నలు వేస్తున్నారు. 


ఇక కొండా సురేఖ ఏమన్నారు అనే విషయానికొస్తే.. నేను ఇప్పటివరకు పేర్లు చెప్పలేదు కదా ఇప్పుడు చెబుతున్నాను వినండి. నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్. ఈరోజు చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తట్టుకోవడానికి కారణం కూడా ఈయనే . ఈయన ఆరోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్లను కూడా డ్రగ్స్ కి అలవాటు చేసి,  రేవు పార్టీలు చేసుకొని , వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్. ఈ విషయం సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ సంచలన కామెంట్లు చేసింది కొండా సురేఖ. దీంతో మొదటగా సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ ఫైర్ అయ్యారు.


 



Also Read: Twin Projects: ప్రమాదకరంగా మూసీ ప్రవాహం.. తెరచుకున్న హైదరాబాద్‌ సాగర్‌ ప్రాజెక్టులు


Also Read: Flood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.