Prashant Kishor: దేశంలో టాప్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు పేరు. ఆయనను తమ పొలిటికల్ అనలిస్టుగా పెట్టుకోవాలని పార్టీలు పోటీ పడుతుంటాయి. గతంలో పీకే వ్యూహకర్తగా పని చేసిన చాలా పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అందుకే ఆయనకు అంత క్రేజీ. ప్రస్తుతం పీకే.. టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. గులాబీ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పీకే టీమ్ లో తెలంగాణ వ్యాప్తంగా సర్వేలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నాయి. ఈ విషయాన్ని గులాబీ బాస్ ఓపెన్ గానే చెప్పారు. అంతేకాదు పీకే అద్బుత వ్యక్తని కొనియాడారు. అయితే తాజాగా ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం పీకే.. టీఆర్ఎస్ కు కటీఫ్ చెప్పనున్నారని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రోజులుగా కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు జరుపుతున్నారు ప్రశాంత్ కిషోర్. 2024 ఎన్నికల కార్యాచరణపై సోనియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరికపైనా చర్చించారు. గతంలోనే పీకే కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో ఆగిపోయింది. కాని ప్రస్తుత పరిణామాలను బట్టి ఆయన హస్తం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు పీకేకు ఆ పార్టీ హైకమాండ్ కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. పీకే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే పని చేయాలని అందులో మొదటి కండీషన్. వివిధ పార్టీలతో ప్రస్తుతం ఉన్న డీల్స్ అన్ని రద్దు చేసుకోవాలని సూచించిందట. పీకే విషయంలో సోనియా నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఇదే ప్రతిపాదన తెచ్చిందని సమాచారం. దేశంలోని వివిధ పార్టీలతో పీకేకు ఉన్న బంధాలపై కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. దీంతో సోనియా కూడా ఈ విషయంలో పీకేకు క్లారిటీ ఇచ్చారని ఏఐసీసీ వర్గాల సమాచారం. 


జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలని తహతహలాడుతున్న పీకే.. కాంగ్రెస్ లో చేరడానికి ఈ కండీషన్లు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కోసం మిగితా పార్టీలతో బంధాలు కట్ చేసుకోవడానికి పీకే సిద్ధమయ్యారని చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్ కు ఆయన గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కు సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. పీకే కాంగ్రెస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పీకే కాంగ్రెస్ కు పని చేస్తే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బలాలు, బలహీనతలపై పీకే పూర్తి అవగాహన ఉంది. కాంగ్రెస్ కు ఇది సానుకూలంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీకే కాంగ్రెస్ లో చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read:Navneet Kaur: ఎంపీ నవనీత్ కౌర్‌కు వీఐపీ భద్రత..!!


Also Read: SVP title Song: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ వచ్చేసింది...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.