Ram Nath Kovind: హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్...స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..
Ram Nath Kovind: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.
Ram Nath Kovind-Statue of Equality: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కాసేపట్లో 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి (Statue of Equality) విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (CM KCR) ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో రాష్ట్రపతి (Ram Nath Kovind) రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌కు వెళ్లనున్నారు.
రాష్ట్రపతి మధ్యాహ్నం 3.30 గంటలకు ముచ్చింతల్ (Muchinthal) చేరుకుంటారు. అక్కడ సమతామూర్తి కేంద్రం, ఆలయాలు, బృహన్‌మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రామానుజుల స్వర్ణమూర్తిని 120కిలోల పసిడితో తయారు చేశారు. సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది మొదటి అంతస్తులో 54 అడుగుల ఎత్తున దీన్ని అమర్చారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో... సమతామూర్తి కేంద్రం వద్ద సుమారు 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం స్వర్ణమూర్తి విగ్రహానికి వేదపండితులు ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు. రాష్ట్రపతి సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని...అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
Also Read: Bandi Sanjay: కేసీఆర్‌లో ఆ భయం మొదలైంది.. అందుకే ఈ డ్రామాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook