President Telangana Schedule Today: తెలంగాణాలో రాష్ట్రపతి పర్యటన.. నేటి షెడ్యూల్ ఇదే!
President Droupadi Murmu Telangana Today Schedule. శీతాకాల విడిది నిమిత్తం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఐదు రోజుల షెడ్యూల్ ఇదే.
India President Droupadi Murmu Telangana Schedule Today: శీతాకాల విడిది నిమిత్తం సోమవారం (డిసెంబర్ 26) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఐదు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి హకీంపేట వైమానిక కేంద్రంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో ఆమెను సత్కరించారు. రాష్ట్రపతి ఐదు రోజుల పర్యటన నేపథ్యంలో నేటి (డిసెంబర్ 27) షెడ్యూల్ ఇదే..
నేటి షెడ్యూల్ ఇదే:
# ఉదయం 10.20 నుంచి 11.30 నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం కానున్నారు.
# మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో పాటు భూటాన్, నేపాల్, మారిషస్ మాల్దీవుల దేశాల అధికారులతో సమావేశంలో మాట్లాడనున్నారు.
# 4.15 నుంచి 4.35 వరకు మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (మిథాని)లో వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్‌ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 28 షెడ్యూల్:
# ఉదయం 10.40-11.10 భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్‌ను వర్చువల్‌లు ప్రారంభిస్తారు.
# మధ్యాహ్నం 3.00-3.30 వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శన. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం. ప్రాజెక్ట్ శంకుస్థాపన
డిసెంబర్ 29 షెడ్యూల్:
# ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం.
# సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శన
డిసెంబర్ 30 షెడ్యూల్:
# ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం.
# సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభం.
# మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇవ్వనున్న రాష్ట్రపతి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.