Priyanka Gandhi visit to Hyderabad : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం (నవంబర్ 24) హైదరాబాద్‌ రానున్నారు. నగరంలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో (LV Prasad Eye Institute) ప్రియాంక కుమారుడు రైహాన్ వాద్రాకు (20) వైద్య చికిత్స చేయనున్నారు. గతంలోనూ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో రైహాన్ వాద్రాకు వైద్య చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు చికిత్స నిమిత్తం మరోసారి ఆసుపత్రికి వస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగేళ్ల క్రితం స్కూల్లో క్రికెట్ ఆడుతున్న సమయంలో రైహాన్ వాద్రా (Raihan Vadra) కంటికి గాయమైంది. మొదట ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రైహాన్‌కు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం రైహాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించారు. తాజాగా మరోసారి చికిత్స నిమిత్తం హైదరాబాద్ రానున్నారు. ఇది ప్రియాంక వ్యక్తిగత పర్యటన కావడంతో కాంగ్రెస్ శ్రేణులెవరూ ఆమెను కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కుమారుడితో కలిసి ప్రియాంక ఢిల్లీ తిరుగుపయనమవుతారు.


Also Read: Alert: మీకు పెన్షన్ వస్తుందా..? అయితే నవంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం!


రైహాన్ వాద్రాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. తన కంటికి గాయమైన సమయంలో  తాను ఎదుర్కొన్న అనుభవాల నుంచి 'Dark Peception' పేరిట ఈ ఏడాది జులైలో తన తొలి ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాడు. ఫోటోగ్రఫీ విషయంలో తల్లి ప్రియాంక గాంధీ తనను చాలా ప్రోత్సహిస్తుందని ఆ సందర్భంగా రైహాన్ వెల్లడించాడు. తన ఫోటోగ్రఫీకి తన తల్లే మొదటి విమర్శకురాలు అని చెప్పాడు. ఫోటో ఎగ్జిబిషన్ కాన్సెప్ట్‌కు సంబంధించి మామయ్య రాహుల్ (Rahul Gandhi) సాయం చేసినట్లు చెప్పుకొచ్చాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook