కొత్త పార్టీ ఏర్పాటుపై కోదండరాం కసరత్తు !
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను కొత్త పార్టీ పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుందని.. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సహచరుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 30న 'కొలువులకై కొట్లాట' సభ
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఏ ఆశతో ప్రజలు తెలంగాణ సాధించుకున్నారో.. ఆ దిశగా ప్రభుత్వం పనిచేయడం లేదని ఆరోపించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానన్న హామీ.. కేవలం మాటలకే పరిమితమైందని టీఆర్ఎస్‌కు సర్కార్‌ను విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఈ నెల 30న 'కొలువై కోట్లాలకై కొట్లాట' బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.