Murder case: నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెం లేని తల కేసులో పురోగతి లభించింది. ఆ వ్యక్తికి సంబంధించిన మొండెం భాగాన్ని పోలీసులు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్​ వద్ద గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందు దొరికిన తల ఆధారంగా హత్యకు గురైన ఆ వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ తండాకు చెందిన రమావత్ జయేందర్ నాయక్(30)గా గుర్తించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు కూడా ఈ ఆ వ్యక్తిని గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా ఆ వ్యక్తి ఫోటోను షేర్​ చేసి వివరాల తెలుసుకోవడం గమనార్హం.


తాజాగా తుర్కయంజాల్​లో.. నూతనంగా నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్లో మొండెం బయటపడపడింది. గత కొంత కాలంగా ఆ వ్యక్తి ఆ ప్రాంతంలోనే నివాసముంటున్నట్లు కూడా తెలిసింది.


మొండెం భాగానికి పోస్ట్​మార్టం నిర్వహించిన తర్వాత ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు నల్గొండ పోలీసులు.


కేసు వివరాలు ఇలా..


నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం మెట్టు మహంకాళి మాత పాదాల వద్ద మూడు రోజుల క్రితం ఓ మొండెం లేని తల లభ్యమైంది. గుప్త నిధులకోసం ఎవరైనా ఇలా చేశారా? కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు ఛేధించేందుకు 8 టీమ్​లు దర్యాప్తు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మొండెం భాగాన్ని గుర్తించారు. ఇక ఈ దారుణానికి పాల్పడింది ఎవరనే విషయంపై విచారణ సాగుతోంది.


ఇటీవలే నల్గొండ ఎస్పీగా ఛార్జ్​ తీసుకున్న రేమా రాజేశ్వరి ఈ కేసును ఛాలెంజింగ్​గా తీసుకున్నారు. ఇందులో భాగంగా కేసులో ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారామె.


Also read: జడ్చర్లలో కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు..


Also read: TS RTC bus points : సంక్రాంతి స్పెషల్ బస్సులు నిలిచే పాయింట్స్‌ ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook