Prostitution in massage center: హైదరాబాద్​లో మరో సెక్స్ రాకెట్ (Sex Rocket in Hyderabad) బయటడింది. మాదాపూర్​లో మసాజ్​ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి గుట్టు రట్టు చేశారు ఎస్​ఓటీ పోలీసులు. మసాజ్​ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి (Prostitution in the name of a massage center) తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముగ్గురు అరెస్ట్​..


అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మసాజ్ సెంటర్​పై ఇటీవల దాడులు నిర్వహించిన పోలీసులు.. రిసెప్షనిస్ట్​ సహా మరో ఇద్దరు వ్యక్తులను (Three arrested in sex racket) అరెస్ట్​ చేశారు.


పోలీసులు ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించారు. లోటస్​ బ్లిస్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ ఉండగా.. అందులో ఈ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఈ మసాజ్ సెంటర్ నిర్వాహకురాలిపై ఇంతకు ముందు నుంచే అనేక ఆరోపణలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అనేక మందిని తన బుట్టలో వేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే ఆమెపై మాదాపూర్​ పోలీస్​ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయాన్ని వెల్లడించారు.


ఇటీవలి కాలంలో హైదరాబాద్​లో స్పాలు, పబ్​ల సెంటర్ల పేరుతో వ్యభిచారా గృహాలను నిర్వహించడం పెరుగుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే  కొత్త పద్ధతుల్లో ఇలాంటి తప్పుడు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు కొందరు వ్యక్తులు.


Also read: IIT Hyderabad Corona: హైదరాబాద్ ఐఐటీలో కొవిడ్ కలవరం.. 119 మంది విద్యార్థులకు కరోనా


Also read: Bandi Sanjay: కేసీఆర్‌ను జైలుకు పంపుడే.. సీఎంపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోందన్న సంజయ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook