Putta Madhu: వామన్‌రావు దంపతుల హత్య వెనుకున్న ఆ మాజీ మంత్రి ఎవరు ?
Putta Madhu arrested by Ramagundam police: మంథని: రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్యపై వామన్ రావు తండ్రి కిషన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు, కోడలు హత్య వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉందని కిషన్ రావు ఆరోపించారు. ఆ మాజీ మంత్రి అండదండలతోనే ఒక పథకం ప్రకారం వామన్ రావు దంపతులను (Advocate couple Vaman Rao murder case) పుట్టా మధు హత్య చేయించాడని కిషన్ రావు వాపోయారు.
Putta Madhu arrested by Ramagundam police: మంథని: రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్యపై వామన్ రావు తండ్రి కిషన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు, కోడలు హత్య వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉందని కిషన్ రావు ఆరోపించారు. ఆ మాజీ మంత్రి అండదండలతోనే ఒక పథకం ప్రకారం వామన్ రావు దంపతులను (Advocate couple Vaman Rao murder case) పుట్టా మధు హత్య చేయించాడని కిషన్ రావు వాపోయారు. హత్య చేసింది కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్‌లు కాగా బిట్టు శ్రీను వారికి ఆయుధాలు సమకూర్చడం, ఈ మొత్తం వ్యవహారం వెనుక పుట్ట మధు ఉంటే.. ఆయన వెనుక ఆ మాజీ మంత్రి హస్తం ఉందని అన్నారు. ఈ దారుణ హత్యల వెనుక గ్రామ స్థాయి నుంచి, మండల, జిల్లా, హైదరాబాద్ వరకు చాలా మంది పడనివాళ్ల పాత్ర ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
Also read : తెలంగాణలో lockdown విధించడం లేదు: సీఎం కేసీఆర్
తన కొడుకు, కోడలుపై దాడి జరిగిన తర్వాత సకాలంలో వారికి చికిత్స అంది ఉంటే వారు బతికేవారేమోనని.. కానీ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆస్పత్రి సిబ్బంది చికిత్స అందించకుండా ఫోన్ చేసి అడ్డంపడ్డాడని కిషన్ రావు ఆరోపించారు. ఈ నిజాలన్నీ బయటికి రావాంటే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, లేనిపక్షంలో ఈ జంటల హత్యల కేసును (Vaman Rao murder case) సీబీఐకి అప్పగించాలని కిషన్ రావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పుట్టా మధును (Putta Madhu) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook