గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వివాదాస్పదమయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై అనుచిత వ్యాఖ్యలతో ..అభిమానుల ఆగ్రహానికి గురై క్షమాపణలు చెప్పుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల  ( Greater Hyderabad Elections ) పోరు రసవత్తర ఘట్టానికి చేరుకుంటోంది. నామినేషన్ల పర్వం ముగిసి..ప్రచారంపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Ex cm ys rajasekhara reddy )పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  ( Dubbaka Bjp Mla Raghunandan rao ) చేసిన అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. వైఎస్సార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రఘునందన్ రావుపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్‌పై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే..తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. కూకట్ పల్లిలోని వైఎస్సార్ అభిమానులు..రఘునందన్ రావు దిష్టిబొమ్మను దగ్దం చేశారు.


గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ( BJP ) ఎమ్మెల్యే నోట వైఎస్సార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సొంతపార్టీ నుంచి కూడా విమర్శలు ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ( Ghmc elections ) సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో వైఎస్సార్ అభిమానుల సంఖ్యకు కొదవ లేదు. 


సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుమారంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం స్పందించారు. వైఎస్సార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. వైఎస్సార్  ( YSR ) అంటే తనకు ఎంతో గౌరవముందని..తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశ్యం లేదని వివరణ ఇచ్చారు. వైఎస్సార్ అభిమానుల మనస్సు నొప్పించి ఉంటే..క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన సేవలు గొప్పవని..ఇప్పటికీ తనకు గౌరవముందని రఘునందన్ రావు చెప్పారు. Also read: Bandi Sanjay: రేపు బండి సంజయ్ బస్తి నిద్ర