దుబ్బాక ఉప ఎన్నికలు కౌంటింగ్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇప్పటివరకూ జరిగిన 8 రౌండ్ల అనంతరం బీజేపీ తన హవా (BJP Leading In Dubbaka Counting after eight rounds) కొనసాగిస్తోంది. బీజేపీ అభ్యర్ధికి మొత్తంగా 3,106 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇప్పటివరకూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 25,878, టీఆర్ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 22,722, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 5,125 ఓట్లు పోలయ్యాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచి బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 353 ఓట్ల ఆధిక్యం, ఏడో రౌండ్‌లో సుజాత రెడ్డికి 182 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే ఇది స్వల్ప ఆధిక్యం కావడంతో 8వ రౌండ్ ఫలితాలో దుబ్బాకలో మళ్లీ ఆధిక్యంలోకి బీజేపీ వచ్చింది. చూస్తే చివరి రౌండర్ వరకు పోటాపోటీగా ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.



 


కాగా, సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Dubbaka By Election Counting Begins) మొదలైంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం వరకు వెలువడనున్నాయి.




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe