Rahul Gandhi Comments: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతూనే  ఉన్నాయి. ఎన్నికల తేదీ విడుదల అయిన తరువాత ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాయి.. గులాబీ బాసు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. తెలంగాణలోని భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ప్రసంగిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్, ఏఐఎంఐఎంపార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి పాలవుతున్నారని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.. ఈ ఎన్నికలు రాజు, ప్రజల మధ్య జరిగే పోరు.. ప్రజలు తెలంగాణ రాష్ట్రం గురించి కలలు కన్నారు.. ప్రజలే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలని పోరాటాలు చేశారు. ఎక్కడైనా ప్రజలే రాష్ట్రాన్ని పాలిస్తారు.. కానీ తెలంగాణలో మాత్రమే ఒక్క కుటుంబం మాత్రమే రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా పాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నియంత్రణ మొత్తం ఒకే కుటంబం చేతిలో ఉందని.. దేశంలోనే అవినీతిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.


తెలంగాణ భూపాలపల్లిలో జరిగిన సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కుల గణాంకాలు దేశానికి ఎక్స్‌రేలా పని చేస్తాయి.  కుల గణాంకాలు గురించి నేను మాట్లాడితే.. ప్రధాని మోదీ కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ నోరుమెదపరు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఏఐఎంఐఎం ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా దాడి చేస్తున్నాయని.. ప్రతిపక్షాలను భయపెట్టేందుకు బీజేపీ పార్టీ కేసులు పెడుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ED మరియు CBI లు తెలంగాణ ముఖ్యమంత్రి వెనక ఎందుకు పడట్లేదు..? ఎందుకు వారిపై కేసులు పెట్టట్లేదు..?? మీరే ఒకసారి ఆలోంచండి. బీజేపీ-బీఆర్‌ఎస్-ఏఐఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒకరితో ఒకరు కలిసిపోయారు.. ఎన్ని అవాంతరాలు వచ్చిన నేను బీజేపీతో పోరాడతాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 




Also Read: IND Vs BAN Dream11 Prediction Today Match: బంగ్లాదేశ్‌నూ చితక్కొడతారా..? మరికాసేపట్లో పోరు.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..  


ఇదిలా ఉండగా..  బీఆర్‌ఎస్‌ నేత ఎమ్మెల్సీ కవిత..  తెలంగాణ ఎన్నికల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాహుల్ గాంధీ గారు.. మీరు తెలంగాణ ప్రజల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సొంత రాష్ట్రాన్ని ఎలా నడిపించాలో మాకు తెలుసు. తలసరి ఆదాయం, వరి ఉత్పత్తి, నీటిపారుదల ప్రాజెక్టుల్లో దేశంలోనే నంబర్‌వన్‌ గా తెలంగాణనే అని కవిత తెలిపారు. 


అంతకుముందు.. రాహుల్ గాంధీ,  సోదరి ప్రియాంక గాంధీ బుధవారం ములుగులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీకి హాజరయ్యారు. ప్రచారంలో.. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య 'రహస్య బంధం' ఉందని ఆరోపణలు చెందారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని.. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఒవైసీ మాట్లాడుతూ.. మేము ఊహించినట్లుగానే, రాహుల్ గాంధీ యొక్క "బి-టీమ్ ప్రచారం" ప్రారంభమైంది.. రాహుల్ గాంధీ మీరెందుకు అమేథీ లోక్‌సభ స్థానాన్ని బీజీపీకి "బహుమతి"గా ఇచ్చారు అని ప్రశ్నించారు. 


Also Read: First Rapid Rail: రేపట్నించి ప్రారంభం కానున్న దేశంలోని తొలి ర్యాపిడ్ రైలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి