Rahul Gandhi On KCR: తెలంగాణ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.  భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. తిమ్మాపూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనా, టీఆర్ఎస్ పార్టీ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపైనా స్పందించారు. కేసీఆర్ కావాలంటే అంతర్జాతీయ పార్టీ కూడపెట్టుకోవచ్చన్నారు. అమెరికా, చైనాలోనూ కేసీఆర్ పోటీ చేసుకొవచ్చని.. కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమి లేదన్నారు. బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసినా కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు రాహుల్ గాంధీ. టీఆర్ఎస్ విధానాలకు తాము పూర్తి వ్యతిరేకమన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ తో పొత్తు వద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. రాష్ట్ర నేతల అభిప్రాయం ప్రకారమే ముందుకు వెళతామన్నారు. టీఆర్ఎస్  తో భవిష్యత్ లోనూ ఎలాంటి పొత్తు ప్రసక్తే ఉండదన్నారు. తెలంగాణలో అవినీతి పాలన సాగుతుందన్న రాహుల్ గాంధీ.. అవినీతికి పాల్పడే వారితో కలిసి పని చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని.. ప్రజా ధనాన్ని లూటీ చేస్తుందని ఆరోపించారు.సీఎం కేసీఆర్.. నితీశ్ తో మాట్లాడితే మాట్లాడుకోవచ్చు.. తమకేమి ఇబ్బంది లేదని తెలిపారు.  కాంగ్రెస్ ఒంటరిగానే పోరాడుతుందని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.


గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. భారత్ జోడో యాత్రపై చాలా కాలంగా అనుకుంటున్నామని చెప్పారు. పాదయాత్రలో ప్రజల సమస్యలపైనే ఫోకస్ చేశానని చెప్పారు.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను ఖర్గే చూసుకుంటారని చెప్పారు. దేశంలో హింసను బీజేపీ ప్రోత్సహిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కార్పొరేట్ వర్గాల కోసమే ప్రధాని మోడీ పని చేస్తున్నారని విమర్శించారు.  బీజేపీ అస్తవ్యస్థ విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు రాహుల్ గాంధీ.