Rahul Gandhi: బీజేపీపై యుద్ధం చేస్తున్నాం.. కాంగ్రెస్‌కు మద్దతివ్వండి: రాహుల్ గాంధీ పిలుపు
Congress Mulugu Public Meeting: దేశంలో బీజేపీపై తాము యుద్ధం చేస్తున్నామని.. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు రాహుల్ గాంధీ. తాము ఏ హామీ ఇచ్చినా.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
Congress Mulugu Public Meeting: రాజకీయ లాభ నష్టాలను పక్కనబెట్టి తాము తెలంగాణ ఏర్పాటు చేశామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితులను మోసం చేశారని.. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాజస్థాన్‌లో 25 లక్షల రూపాయల వరకు ఉతిత హెల్త్ పాలసీ తీసుకొచ్చామని.. ఛత్తీస్‌గఢ్‌లో రైతులకు రుణ మాఫీ చేశామన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చామని.. అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నాని చెప్పారు. తాము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటామన్నారు. మీ పోడు భూములను మీకు ఇప్పిస్తామన్నారు. ములుగులో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
"సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తాం.. తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ. బీజేపీ.. బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే. పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. విపక్ష నేతలందరిపైనా కేసులు పెట్టినా.. కేసీఆర్‌పై ఒక్కకేసు పెట్టలేదు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లే. దేశంలో బీజేపీపై మేము యుద్ధం చేస్తున్నాం.. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు తెలపండి..
బీఆర్‌ఎస్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ.. ఇలా ఏ హామీని నెరవేర్చలేదు. రాజస్థాన్‌లో ఆరోగ్య పథకం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఛత్తీస్‌గడ్‌లో వారి ధాన్యాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వార్ ధాన్యానికి ఆ రాష్ట్రంలో ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేసి చూపింది. రాష్ట్రంలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తాం.
మేం ఏ మాట ఇచ్చామో అది నిబెట్టుకున్నాం.. తెలంగాణలోనూ మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపుతాం. దేశంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం.. తెలంగాణలో బీఆర్‌స్, కాంగ్రెస్‌కు మధ్యనే పోటీ.. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోంది. వీరికి ఎంఐఎం మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. రాజకీయ లాభ నష్టాలను పక్కనబెట్టి మేము తెలంగాణ ఏర్పాటు చేశాం.." అని రాహుల్ గాంధీ అన్నారు.
ఇది కూడా చదవండి: IND vs BAN World Cup 2023: రేపే బంగ్లాదేశ్‌తో భారత్ పోరు.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా..? పిచ్ రిపోర్ట్ ఇలా..!
ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.