Telangana Rains:తెలంగాణలో  కాస్త గ్యాప్‌ తరువాత మళ్లీ వర్షాలు కురవబోతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ రోజు పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం ఎండకాసినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని చెప్పారు.రేపు  ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజ్నన సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు.


ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురవబోతున్నాయనే విషయం లోతట్టు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.