Rains in Telugu States: వెదర్ అలర్ట్.. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు రాగల 3 రోజులు, ఏపీకి ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని... గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమ విదర్భ నుంచి మరాట్వాడా మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని.. సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తున ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీలో వర్షాలు :
ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నందునా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని ఒకటి, రెండు చోట్ల రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి (ఏప్రిల్ 17)న ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఎండ వేడిమి, ఉక్కపోతతో బాధపడుతున్న జనాలకు వర్ష సూచన చల్లని కబురే అయినప్పటికీ రైతులకు మాత్రం ఈ వర్షాలతో నష్టాలు తప్పవు. పంటలు చేతికొచ్చే సమయంలో కురిసే ఈ వర్షాలను చెడగొట్టు వానలని కూడా పిలుస్తారు. వర్ష సూచన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook