Raksha Bandhan 2022: దేశవ్యాప్తంగా రాఖీ పండగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాఖీ వేళ అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు అంతా ఒక్కచోట చేరి పండగను సంతోషంగా జరుపుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మంత్రి, తన సోదరుడైన కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్, కవిత రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ రాఖీ వేడుక జరిగింది. కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాఖీ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన సోదరి కవితతో దిగిన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అలాగే, తన కూతురు, కొడుకు చిన్ననాటి ఫోటోను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకమైనవి అంటూ ఆ ఫోటోలకి తన కామెంట్‌ను జతచేశారు. కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టిన ఫోటోలు, చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా రాఖీ పండగ శుభాకాంక్షలు చెబుతున్నారు.


రాఖీ పండగ వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో అనాదిగా కొనసాగుతున్న గొప్ప ఆచారం రాఖీ పండగ అని పేర్కొన్నారు. రక్షా బంధన్ వేడుకలు దేశ ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షించారు. అక్కాచెల్లెళ్లకు సోదరులు ఎల్లవేళలా అండగా ఉంటామనే భావన రక్షా బంధన్‌లో ఉందన్నారు. మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు కూడా రాష్ట్ర ప్రజలకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. 



 


Also Read:Macherla Niyojakavargam: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ఆకట్టుకుందా?


Also Read: TS Eamcet 2022 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook