Rasamayi: తెలంగాణ సంస్కృతిని అవమానిస్తావా.. ? రేవంత్, దిల్ రాజును ఏకిపారేసిన రసమయి..
Rasamayi Balakishan fires on Revanth Reddy: రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచబోమని చెప్పిన మాటలు నీట రాతలే అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీఎం తీరును ఏకి పారేసారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్ల పెంపు ఉండబోదని ప్రకటించిన రేవంత్ సర్కారు ఇపుడు నాలుక మడతేసిందన్నారు.
Rasamayi Balakishan fires on Revanth Reddy: పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్బంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇకపై ఇక్కడ ఏ సినిమాలకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్స్ పెంచబోమని చెప్పారు. కానీ తాజాగా దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ఆ నిబంధనలు సడలించారు. ఈ సినిమాకు తొలి రోజు రెండు అదనపు ఆటలకు ప్రత్యేకంగా అనుమతులిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ,బెనిఫిట్ షో లపై అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయిందన్నారు.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు నిర్మాత గా ఉన్న సినిమా గేమ్ చేంజర్ కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ దిల్ రాజు కు ఎంతకు అమ్ముడు పోయారన్నారు.
తెలంగాణలో అధికారంలో వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నా రేవంత్ రెడ్డి.. దానిపై మాట తప్పినట్టే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై ముఖ్యమంత్రి మాట తప్పిన విషయాన్ని గుర్తు చేసారు. తెలంగాణ వాడైన దిల్ రాజు ఇక్కడి ప్రజలను తన మాటలతో అవమాన పరిచారు.
సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి బెనిఫిట్ షో లపై శాసనసభను తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టం తప్ప రేవంత్ కి ఏదీ చేత కావడం లేదన్నారు. ఆరు గ్యారంటీలు, టికెట్ రేట్స్ పెంపు సహా అన్ని విషయాలపై యూ టర్న్ తీసుకుంటున్న రేవంత్ కు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.