Rats eats patient's hands and legs fingers: ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో వరంగల్ ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. సూపరింటెడెంట్‌పై బదిలీ వేటు పడింది. గతంలో సూపరింటెండెంట్‌గా ఉన్న చంద్రశేఖర్‌కు ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంజీఎం ఘ‌ట‌న‌ వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు స్పందించారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు త‌క్ష‌ణం నివేదిక రూపంలో పంపించాల‌ని, రోగికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాధిప‌తులు ఆర్ఐసీయు, ఆసుప‌త్రి ప్రాంగ‌ణం అంతా క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఘ‌ట‌న‌కు దారితీసిన కార‌ణాల‌ను ఆరా తీసిన విచార‌ణ అధికారులు నివేదిక రూపొందించి ప్ర‌భుత్వానికి అందించారు. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంది.  

ఎంజీఎం సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు గాను ఇద్ద‌రు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) స్పష్టం చేశారు.


Also read : Milk Side Effects: మీరు అతిగా పాలు తాగుతున్నారా? అయితే మీకు ఇదో హెచ్చరిక!


Also read : Pomegranate : షుగర్ వ్యాధిగస్త్రులు దానిమ్మ పండ్లు తినవచ్చా...?


Also read : Sugarcane Juice: డయాబెటిక్ రోగులు చెరకు రసం తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook