Rave party busted in Gachibowli Hyderabad: తెలంగాణ లో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా డ్రగ్స్ ఘటనలపై పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. డ్రగ్స్ ఫ్రీస్టేట్ గా మారేందుకు అధికారులంతా పనిచేయాలని కూడా కోరారు. ఈ క్రమంలోనే ఎక్కడైన డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసిన కూడా అలాంటి ఘటనలు  పోలీసులకు చెప్పాలని కూడా తెలిపారు. హైదరాబాద్ పోలీసులు.. డ్రగ్స్, గంజాయిపై ఘటనలపై సీరియస్ గా చర్యలు చేపట్టారు. అయిన కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్ల నిరంతరం తనిఖీలు జరుగుతునే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా కాలేజీలు, టెకీ ఉద్యోగులే టార్గెట్ గా చేసుకుని మరీ డ్రగ్స్ చాక్లెట్ ల అమ్మకాలు జరుగున్నఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో పలు చోట్ల.. రేవ్ పార్టీ ఘటనలు తరచుగా  వార్తలలో ఉంటున్నాయి.  తాజాగా, మరో రేవ్ పార్టీ ఘటన గచ్ఛిబౌలీలో  వెలుగులోకి వచ్చింది.


పూర్తి వివరాలు..


హైదరబాద్ లో తరచుగా డ్రగ్స్ ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. పోలీసులు రేవ్ పార్టీలు, డ్రగ్స్ ఘటనపై ఎన్నిచర్యలు తీసుకున్న కూడా.. సీక్రెట్ గా రేవ్ పార్టీలు మాత్రం ఆగడంలేదు. తాజాగా, గచ్ఛిబౌలీలోని ఒక గేస్ట్ హౌస్ లో.. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకిదిగి.. రేవ్ పార్టీనీ భగ్నం చేశారు.


ఈ ఘటనలో 6 మంది అమ్మాయిలు,  12 మంది  యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఘటన స్థలంలో.. భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లు, ఇ సిగరెట్లు ఉన్నట్లు కూడాతెలుస్తోంది. రేవ్ పార్టీనీ కొంత మంది టెకీలు కలిసి స్పాన్సర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అక్కడున్న యువతీ, యువకులు.. గంజాయిని గుప్పు గుప్పుమంటూ పీల్చుకుంటూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారంట.


Read more: Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..


ఈ నేపథ్యంలో పోలీసులు ఇంత భారీ ఎత్తున గంజాయి ఎవరు తీసుకొచ్చారు.. దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎస్ఓటీ పోలీసులు..యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ రేవ్ పార్టీలో పలువురు సినిమాలకు సంబంధించి జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారంట.  ఈ ఘటనతో మరోసారి రేవ్ పార్టీ ఘటన హైదరబాద్ లో రచ్చగా మారింది.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.