Telangana Rain ALERT: నాలుగు రోజులుగా తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తింది. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చింది. సాధారణంగా గోదావరికి జూలైలో వరదలు వచ్చినా... లక్ష క్యూసెక్కుల లోపే ఉండేది. ప్రస్తుతం 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కురుస్తున్న కుంభవృష్టితో పాటు మహారాష్ట్ర నుంచి వరద పెరుగుతోంది. అటు ఛత్తీస్ గఢ్ నుంచి భారీగా వరద గోదావరిలోకి వస్తోంది. దీంతో భద్రాచలం దగ్గర గంటగంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వందేళ్ల చరిత్రలో ఎప్పుడు లేనట్లుగా జూలై నెలలోనే పోలవరం దగ్గర గోదావరికి రికార్డ్ స్థాయి వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలవరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా నీటిని దిగువకు వదులుతున్నారు. సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్ నుండి 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని స్పిల్ వే గేట్ల ద్వారా కిందకు వదిలేశారు. భద్రాచలం నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నుంచి భారీగా ప్రవాహం వస్తోంది. దీంతో పోలవరం దగ్గర సోమవారం మధ్యాహ్నానికి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో  రాత్రి వరకు పోలవరం దగ్గర వరద 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరవచ్చని చెబుతున్నారు.ప్రస్తుతం పోలవరం దగ్గర గోదావరి నీటిమట్టం 32.2 మీటర్లకు చేరింది. గంటకు 35 సెంటిమీటర్ల చొప్పున  నీటి మట్టంపెరుగుతుంది. దిగువ కాఫర్ డ్యాం దగ్గర గోదావరి నీటి మట్టం 20 మీటర్లకు చేరింది. ఆకస్మిక వరదలతో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.


కాళేశ్వరంతో పాటు భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు నీటిమట్టం 49.9 అడుగులకు చేరింది. వరద ప్రవాహం 12 లక్షల 45 వేల 172 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 48 అడుగులకు చేరగానే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాదక హెచ్చరిక ఇస్తారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జూలై రెండో వారంలో నిండిపోయింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యామ్ రెండు గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద కాలువ ద్వారా మరో 10 వేల క్యూసెక్కుల నీటిని లోయర్ మానేరు డ్యామ్ కు వదిలారు. శ్రీరామసాగర్ గేట్లు పూర్తిగా ఎత్తితే పోలవరం దగ్గర వరద మరింత పెరగనుంది. 


Read also: TS EAMCET: తెలంగాణ ఎంసెట్ వాయిదా?


Read also: Telangana Rain ALERT:కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook