Renjarla Rajesh News: సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేంజర్ల రాజేష్ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బాసర దేవాలయం వద్ద మంగళవారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ మధ్యకాలంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని నిరసనకారులు ఆందోళనకు దిగారు. మొన్న అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న ఉదంతాన్ని గుర్తుచేస్తూనే.. తాజాగా బాసర సరస్వతి అమ్మవారిపై రాజేష్ అసభ్యపదజాలంతో దూషణలకు దిగడం సరికాదని ఆందోళనకారులు హితవు పలికారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ దేవతలు, హిందూ దేవుళ్లను దూషించి పబ్లిసిటీ సొంతం చేసుకోవాలని చూసే ఇటువంటి దుర్మార్గులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలంగాణ మతైక అర్చక ఉద్యోగ సంఘం జనవరి 4వ తేదీ బుధవారం తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆందోళనకు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం నిత్య పూజల అనంతరం భక్తులతో కలసి నిరసన తెలియజేయ వలసినదిగా తెలంగాణ మతైక అర్చక ఉద్యోగ సంఘం రాష్ట్రంలోని దేవాలయాల అర్చకులు, ఇతర సిబ్బందికి విజ్ఞప్తి చేసింది.


ఇది కూడా చదవండి : Renjarla Rajesh: హిందూ ద్రోహులకు ప్రభుత్వం వత్తాసు.. వీహెచ్‌పి సంచలన ఆరోపణలు


ఇది కూడా చదవండి : HMRL Staff Protests: ఐదేళ్లుగా అదే జీతమంటే ఎలా ? మెట్రో రైలు సిబ్బంది ధర్నా.. స్పందించిన మేనేజ్మెంట్


ఇది కూడా చదవండి : Thief Sleeping: దొంగతనానికి వచ్చి తాపీగా నిద్రపోయిన దొంగ.. చివరికి ఊహించని ట్విస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook