Republic Day 2022 in Telangana: హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day celebration 2022) ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సహా డీజీపీ మహేందర్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సికింద్రాబాద్‌లో సైనికవీరుల స్మారకం వద్ద సీఎం నివాళులర్పించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యుత్తమ రాజ్యాంగం మనదే: తమిళిసై
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ (governor Tamilisai) అన్నారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.... అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా ఎదగడం సంతోషకరంగా ఉందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ ఎదిగిందన్న ఆమె.. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.