తనకు అవకాశం వస్తే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్ టీ(భాజపా)అభ్యర్థిగా మహబూబాబాద్ లోకసభ స్థానానికి పోటీ చేస్తానని టాలీవుడ్ నటి, 'ఈ రోజుల్లో' ఫేమ్ రేష్మా రాథోడ్ చెప్పారు. తనను యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమిస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని నటి ధీమా వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజల సమస్యలతో పాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకునేందుకు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్ జయంతి రోజున ఆమె బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే! బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయనను కలుసుకుని ఘన స్వాగతం పలికిన వారిలో రేష్మా కూడా ఉన్నారు.


'హారితహారం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు'


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హారితహారం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అలానే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ళ పథకం, ఇతర పథకాల అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12,751 గ్రామ పంచాయతీలకుగానూ కేవలం 3,494 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులను నియమించారని గుర్తుచేశారు. దాదాపు 13 వందల కోట్ల రూపాయలను పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చిందని ఈ సందర్భంగా యెండల గుర్తుచేశారు.