Revanth On DSC Exams: కొన్ని వారాలుగా తీవ్ర ఉద్యమం చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు రేవంత్‌ రెడ్డి భారీ షాకిచ్చారు. డీఎస్సీ పరీక్ష వాయిదా లేదంటూ స్పష్టం చేశారు. వాయిదా పేరుతో కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. డీఎస్సీ పరీక్ష కచ్చితంగా నిర్వహిస్తామని ఆయన మాటలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: DSC Aspirants: తెలంగాణ నిరుద్యోగులు సంచలనం.. డీఎస్సీ వాయిదాకు అర్ధరాత్రి ఉద్యమం


 


ఈనెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించడానికి విద్యా శాఖ షెడ్యూల్‌ విడుదల చేయడంతో డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర పోరాటం చేస్తున్నారు. ఓయూతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా రేవంత్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మహబూబ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన ఓ సభలో రేవంత్‌ మాట్లాడారు. డీఎస్సీ పరీక్షలపై ఓ స్పష్టత ఇచ్చారు. డీఎస్సీ వాయిదాపై బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.


Also Read: TS DSC Schedule: తెలంగాణ నిరుద్యోగులకు భారీ షాక్‌.. షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు


 


'గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాని చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోంది. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ధైర్యం చేస్తే.. ఎప్పుడు పార్టీ బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు' అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.


పరీక్షల వాయిదా కోసం హరీష్ రావు, కేటీఆర్ ఆమరణ దీక్షకు కూర్చోవాలంటూ సవాల్ విసిరారు. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. 'పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వాళ్ల పక్షాన మీరు దీక్షకు దిగండి' అని చెప్పారు. 'మా ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే ఆ పని చేయాలి' అని సవాల్‌ చేశారు. 'పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.


పరీక్షలు ఎప్పుడు?
షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 11వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. డీఎస్సీ నిర్వహించేందుకు ఇటీవల టెట్‌ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter