Telangana DA Approve: ప్రభుత్వ ఉద్యోగులను ఊరించి ఊరించి చివరకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఊరడింపు కూడా ఇవ్వకుండా భారీ షాక్‌ ఇచ్చింది. రెండు డీఏలకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం కేవలం ఒక డీఏ మాత్రమే. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని బీద అరుపులు అరుస్తూ ఒక్క డీఏకు ఆమోదం తెలపడం ఉద్యోగులను తీవ్ర విస్మయానికి గురి చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MEIL Donation: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పంచన చేరిన మేఘా కృష్ణారెడ్డి.. రూ.200 కోట్ల విరాళం


 


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలకు మోక్షం లభిస్తుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అధికారం మారి కాంగ్రెస్‌ పార్టీ రావడంతో తమ పెండింగ్‌ డీఏలు విడుదలవుతాయని ఆశిస్తుండగా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇటీవల ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉద్యోగులతో చర్చలు జరిపిన ప్రభుత్వం రెండు డీఏల విడుదలకు అగీకారం తెలపగా.. తాజాగా శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయం ప్రకటించింది. ఒక డీఏ మాత్రమే ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఒకటే ఇవ్వడానికి గల కారణాలను ఆయన వివరించారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. ఈ క్రమంలోనే ఒకటి మాత్రమే ఇవ్వగలమని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Also Read: Constable Row: కానిస్టేబుళ్ల భార్యల పోరాటానికి దిగి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం


 


హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో శనివారం మంత్రివర్గ సమావేశం ఐదున్నర గంటల పాటు కొనసాగింది. రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్కతోపాటు అన్ని శాఖల మంత్రులు హాజరై పాలనాపరమైన నిర్ణయాలు చర్చించారు. సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి, పొన్నం తదితరులు వివరాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే డీఏల విషయమై కూడా మంత్రులు సమాధానం ఇచ్చారు. 'రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎలు పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగులకు ఒక డీఏ వెంటనే ఇస్తాం' అని తెలిపారు.


మంత్రివర్గ సమావేశంపై ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలింది. ఐదు డీఏల్లో రెండు డీఏలు వస్తాయని భారీ ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని తప్పుబడుతున్నారు. తమతో సమావేశమైన సమయంలో రెండు డీఏలకు అంగీకరించిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఒకటే డీఏ ఇవ్వడం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోసారి మోసం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమం చేపట్టే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook