Revanth Reddy Challenges KTR: తనపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని.. తాను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రడ్డిపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి తన పాదయాత్రలోనే కౌంటర్ ఇస్తూ.. తనపై ఎలాంటి ఆరోపణలు ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధం అని అన్నారు. మరి మీపై, మీ ప్రభుత్వంపై నేను చేస్తున్న ఆరోపణలపై జడ్జితో విచారణకు సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లంచ్ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... " భూమి అనేది మన తల్లితో సమానం. సాయుధ రైతాంగ పోరాటం, 1969 లో తెలంగాణ ఉద్యమం జరిగింది కూడా భూముల కోసమే. అలాంటి భూములను ధరణి వ్యవస్థను తీసుకొచ్చి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో నిజాం ముందు నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను డ్రామారావు, మిత్ర బృందం కొల్లగొట్టింది అని ఆరోపించారు. వారి మాట వినే కలెక్టర్ల ద్వారా భూ దోపిడికి పాల్పడ్డారు అని అన్నారు. 


నేను భూదందాలకు పాల్పుడుతున్నా అని అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నాపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో జరిగిన భూ లావాదేవీలపై, 2004-14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ అంటే నిషేధిత జాబితాలో చేర్చిన భూముల్లో ఎన్నివేల ఎకరాల భూములను ఆ జాబితా నుంచి తొలగించారు ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలి అని కేటీఆర్ కు సవాలు విసిరారు. 


అమెరికా కంపెనీని బెదిరించి తెల్లాపూర్‌లోని 100 ఎకరాల విస్తీర్ణంలోని రూ. 5 వేల కోట్ల విలువైన భూములను కేవలం రూ.260 కోట్లకే ప్రతిమ శ్రీనివాస్ పేరిట బదలాయించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అందులో వేల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. అందులో మంత్రి కేటీఆర్‌కు కూడా భాగస్వామ్యం ఉంది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడైన నేత తోట చంద్రశేఖర్‌కు మియాపూర్లో ఎకరం 100 కోట్లు ఉండే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టిందన్నారు. అలాగే మియాపూర్లో సర్వే నెంబర్ 80లో రూ. 500 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఏవిధంగా వచ్చిందనేది చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి బదిలీ కోసమే రెడ్యా నాయక్‌ను పార్టీ మార్పించింది వారి కూతురు కవిత. కూతురు భూ దాహం తీర్చడం కోసమే రెడ్యా నాయక్ పార్టీ మారారు. ఇది నిజం కాకపోతే ఈ విషయంపై కవిత చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.


ఇది కూడా చదవండి : Asaduddin Owasi: తాజ్ మహల్ కంటే అందంగా కొత్త సెక్రటేరియట్‌.. లోపల మసీదు నిర్మాణం


ఇది కూడా చదవండి : Revanth Reddy Challenges KCR: రేవంత్ రెడ్డి నోట మళ్లీ అదే మాట.. ప్రభుత్వానికి అదే సవాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook