Revanth vs Tollywood: అధికారంలోకి వచ్చాక తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ పరిశ్రమపై అసహనం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తాను ప్రతిపాదించిన అవార్డుల విషయంలో సినీ పరిశ్రమ నుంచి స్పందన రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ తన నిర్ణయంపై స్పందించకపోవడాన్ని ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. వారి నుంచి స్పందన లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 


Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..

తెలంగాణ దిగ్గజ రచయిత, జ్ఞాన్‌పీఠ్‌ పురస్కార గ్రహీత డాక్టర్‌ సీ నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి 'విశ్వంభర డాక్టర్‌ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం' ప్రదానం చేశారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమను ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.

Also Read: Gaddar Awards - Revanth Reddy: రేవంతన్న ఈ గద్దర్ అవార్డ్స్ ఏంటన్నా..


గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడంపై అసంతృప్తికి లోనయ్యారు. ఈ ఏడాది జనవరిలో నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తామని రేవంత్‌ ప్రకటించారు. గద్దర్‌ అవార్డుల కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాలు, సూచనలు అందించాలని నాడు రేవంత్‌ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమను కోరారు. తాజాగా ఈ సభలో ఆయన మాట్లాడారు.


'సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం' అని  రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా రేవంత్‌ చేసిన గద్దర్‌ అవార్డుల ప్రతిపాదనపై సినీ పరిశ్రమ నుంచి సానుకూల స్పందన రాలేదు. నంది అవార్డులకు గద్దర్‌ పేరు పెట్టడం టాలీవుడ్‌కు నచ్చలేదు. ఒక్క మోహన్‌ బాబు మినహా ఏ నటీనటులు, దర్శక నిర్మాతలు ఎవరూ కూడా గద్దర్‌ అవార్డులను స్వాగతించలేదు. సినీ పరిశ్రమపై నెల రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి ఇలా దురుసు వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.