Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, అటు కేంద్రం వంట గ్యాస్ ధరల పెంపు సమన్వయంతో జరిగిన కుట్రగా అభివర్ణించారు. అసలు రాష్ట్రంలో విద్యుత్ డిస్కాంలు ఆర్థిక సంక్షోభంలో కూరుపకుపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. గాంధీ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు..


ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపును కప్పిపుచ్చుకుంటున్నాయన్నారు. ధరలు పెంచు ప్రజలను దోచుకోవాలన్నదే ప్రభుత్వాల కుట్ర అని విమర్శలు చేశారు.


రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ.12 వేల కోట్ల అదనపు భారం పడుతోందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల్లో కొంత మంది బిల్లులు ఎగవేత వల్లే డిస్కాంలకు రూ.6 వేల కోట్ల వరకు నష్టం వాటిళ్లిందని చెప్పుకొచ్చారు. ఉచితంగా ఇస్తున్నామని చెప్పి.. ప్రజలపై భారం మోపుతోందని విమర్శలు చేశారు.


అప్పుడు రేట్లు పెరగలేదు..


ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ప్రస్తావిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఐదు రాష్ట్రాల ఎన్నకల కారణంగా నాలుగు నెలలపాటు ధరలు పెరగలేదన్నారు రేవంత్. ఎన్నికల కోసం ధరలను పెరగకుండా చూశారన్నారు. ఎన్నికలు ముగిసిన కారణంగా ఇప్పుడు ధరల బాదుడు ప్రారంభించారన్నారు.


బీజేపీ ప్రకారం జీడీపీ అంటే.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనే పరిస్థితి ఉందన్నారు రేవంత్​.


30, 31 తేదీల్లో నిరసనలు..


రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా.. ఈ నెల 30న మండల, నియోజకవర్గాల్లో విద్యుత్​ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మరుసటి రోజు మహిళా కాంగ్రెస్​ ఆద్వర్యంలో వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.


Also read: Big debate with Bharath: ఈటల రాజేందర్‌కి సీఎం కేసీఆర్‌తో అక్కడే చెడిందా ? ఈటలతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ


Also read: Electricity Demand in Telangana: తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook