తెలంగాణ టీడీపీ విభాగాన్ని టీఆర్ఎస్‌లో కలపాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై టీడీపీ రెబల్, కాంగ్రెస్ నేత  రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందిచారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేయాలంటూ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. వాస్తవానికి టీడీపీని నాశనం చేసిందే కేసీఆర్ అని..అలాంటి పార్టీలో టీడీపీని కలపడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి తరుణం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండాలా ? లేదా వ్యతిరేకంగా ఉండాలా ? అనే విషయాన్ని పార్టీలన్నీ ఆలోచించుకోవాలని వెల్లడించారు.


కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందనే విషయం సత్యమైనప్పటకీ ఇప్పడు ఆ వాదనకు కాలం చెల్లిందని రెవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. కాగా రేవంత్ వ్యాఖ్యలు పరోక్షంగా టీడీడీ-కాంగ్రెస్ దోస్తీ కానీ..టీడీపీని కాంగ్రెస్ లో విలీనం అనే అర్థం వచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.