హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల సంఘంపై, మంత్రులపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ లోని  గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ ప్రజలను మోసం చేయడానికి మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు మాట్లాడిన తీరు అదేవిధంగా ఉందని ఆరోపించారు.


మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులపై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. నోటీసు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ వివరణ ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. తన ఓటు ఎవరికి వేశారో ఆ విషయాన్నిబహిరంగంగా ప్రకటించిన మంత్రి గంగుల కమలాకర్ పై ఇప్పటి వరకు క్రిమినల్ కేసును ఎన్నికల నిర్వహణ అధికారులు ఎందుకు పెట్టలేదని ఎన్నికల సంఘాన్ని వివరణ కోరారు. మంత్రి మల్లారెడ్డి బేరసారాల విషయానికి సంబంధించిన బయటకు వచ్చిన టెలిఫోన్ సంభాషణల ఆడియో టేప్ పై తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం మంత్రిపై కేసు పెట్టకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..