Allu Arrest: అపుడు నాగార్జున.. ఇపుడు అల్లు అర్జున్.. రేవంత్ దెబ్బ మాములుగా లేదుగా..
Allu Arjun Arrest: తెలంగాణలో కొలువైన రేవంత్ రెడ్డి సర్కార్ .. సినీ నటులుపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతుందా.. అప్పట్లో హైడ్రా ఇష్యూలో నాగార్జునను వెంటాడిన రేవంత్ సర్కార్.. తాజాగా పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ ను పోలసులు అరెస్ట్ వ్యవహారం చూస్తుంటే.. రేవంత్ సర్కార్ తనకు గిట్టనివాళ్లపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందా అనే అనుమానాలు సాధారణ ప్రజల్లో నెలకొన్నాయి.
Allu Arjun Arrest: ఆంధ్ర ప్రదేశ్ లో అప్పటి వై.యస్. జగన్మోహన్ రెడ్డికి అనుబంధంగా ఉన్న హీరోలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేసాడా.. కొన్ని నెలల క్రితం నాగార్జున.. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. అప్పట్లో హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి.. తుమ్మిడి హట్ట చెరువులో అక్రమంగా నిర్మించిన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసారు. నగరంలో ఎన్నో చోట్ల చెరువులను నాలాలను కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల నాయకులు కట్టుకున్న విల్లాలు.. ఇతర కట్టడాల వాటి జోలికి పోకుండా.. కేవలం నాగార్జున కు చెందిన కట్టడాన్ని టార్గెట్ చేయడం వెనక రాజకీయ వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక హీరోకు సంబంధించిన ప్రాపర్టీ అని లెక్క చేయకుండా మొదట్లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటనపై రేవంత్ సర్కార్ పై ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. అదే సమయంలో ఓల్డ్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన ఒవైసీతో పాటు కొంత మంది కాంగ్రెస్ అగ్రనేతల అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్‌డోజర్లు ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నలు వచ్చాయి.
మరోవైపు కాంగ్రెస్ కు చెందిన మహిళ మంత్రి..కేటీఆర్ కు నాగార్జున మాజీ కోడలు సమంతను టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేసింది. దీనిపై విచారం వ్యక్తం చేయలేదు కొండా సురేఖ. ఈ విషయమై రేవంత్ రెడ్డి ఇదంత కరెక్ట్ కాదని కూడా చెప్పలేదు. కనీసం తన క్యాబినేట్ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించను లేదు.
తాజాగా పుష్ప 2 వ్యవహారంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం వెనక అల్లు అర్జున్ బాద్యుడిని చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేయడం వెనక కూడా రేవంత్ రెడ్డి సర్కారు హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ ఇద్దరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించరన్న ఒకే ఒక్క రీజన్ తో వీళ్లను రేవంత్ సర్కారు వేధింపులకు దిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా శుక్రవారమే బన్నిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం వెనక కూడా శని, ఆదివారాలు కోర్టులు ఉండవు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసి జైల్లో వేసి తన ప్రతాపం ఏంటో చూపించాలనే ఉద్దేశ్యంతో ఇదంత చేసాడనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 ప్రెస్ మీట్లో తన పేరు మర్చిపోవడంపై రేవంత్.. అల్లు అర్జున్ తీరుపై గుర్రుగా ఉన్నారు రేవంత్ రెడ్డి. తన పేరు భవిష్యత్తులో మర్చిపోకుండా గుర్తించుకోవాలనే ఉద్దేశ్యంతో ఇదంత చేసినట్టు అల్లు అర్జున్ అభిమానులతో పాటు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. మొత్తంగా దేశంలో ఎంతో మంది నేరస్తులను అరెస్ట్ చేయడం మానీ.. ఈ ఘటనతో సంబంధం లేని అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.మరవైపు అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పైగా చనిపోయిన మహిళ భర్త తాను అల్లు అర్జున్ విత్ డ్రా చేసుకుంటున్నట్టు చెప్పినా..అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తంగా అపుడు నాగార్జున..ఇపుడు అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శకులు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.