Revanth Reddy: మొదట కేసీఆర్.. తర్వాత కేటీఆర్.. చివరకు హరీశ్ రావును ఫినిష్ చేస్తా
Revanth Reddy Hot Comments In Chit Chat: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మొదలుకుని హరీశ్ రావు వరకు అందరినీ ఫినిష్ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
Revanth Reddy Chit Chat: బాంబ్ పేలుస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ బావ మరిది ఇంట్లో జరిగిన దావత్‌పై చేసిన నానా హడావుడి బెడిసి కొట్టింది. ఈ వ్యవహారంపై స్పందించిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి పండుగ అలా చేసుకుంటారని తనకు తెలియదని పేర్కొంటూనే కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులపై విరుచుకుపడ్డారు. తాను మూసీ ప్రాజెక్టుపై ఎట్టి పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్తానని ప్రకటించారు. దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని తిప్పికొట్టి ప్రజలను ఒప్పిస్తానని చెప్పారు.
మూసీ ప్రాజెక్టు అభివృద్ధిపై కొరియా పర్యటన చేపట్టిన మీడియా బృందంతో రేవంత్ రెడ్డి మంగళవారం చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాటలు కలకలం రేపాయి. బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తాను ఫినిష్ చేస్తానని ప్రకటించారు. కేసీఆర్ మొదలుకుని హరీశ్ రావు వరకు అందరినీ ఫినిష్ చేస్తానని తెలిపారు.
Also Read: Renamed: రేవంత్ రెడ్డికి కొత్త పేరు పెట్టిన మాజీ మంత్రి హరీశ్ రావు.. ఏం పేరు తెలుసా?
'మూసీ ప్రాజెక్టు విషయమై వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా. మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నదిపై కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌కు ఏమేం కావాలో నాకు గానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ చెప్పాలి' అని చెప్పారు. 'వాళ్లు ఫామ్ హౌస్‌లో ఉండవచ్చు.. మూసీ ప్రజలు మాత్రం అక్కడే ఉండాలా' అని మరోసారి ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గడువు ముగిసిన మెడిసిన్ అని పేర్కొన్నారు. 'కేటీఆర్‌తోనే కేసీఆర్ రాజకీయం ముగుస్తుంది. బావతో బామ్మర్ది రాజకీయం ముగుస్తుంది. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు' అని మీడియా బృందంతో తెలిపారు. 'పోలీస్‌లను పెట్టి వాళ్లను అరెస్ట్ చేయవచ్చు. కానీ అది నా విధానం కాదు. వాళ్లు వెళ్లి ప్రజల ఆలోచనలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
'కూకట్‌పల్లికి వెళ్లిన కేటీఆర్ చిన్నపాపకి బ్యాగ్ ఇచ్చాడు. కానీ నేను ఇళ్లు ఇస్తాడనుకున్నా' అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం తగ్గిపోవడంపై రేవంత్ స్పందిస్తూ.. 'దేశమంతా సంక్షోభం ఉంది. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్‌లతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణలు కొనసాగుతున్నాయి. చట్టప్రకారం చర్యలు ఉంటాయి' అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుల పాస్‌పోర్ట్ రద్దయింది. అనధికారికంగా ఎంతో కాలం విదేశాల్లో ఉండలేరు' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook