Telangana: మమ్మల్ని అభినందించాల్సింది పోయి.. మాపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ విమర్శలా?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హామీల అమలుపై ఎలాంటి అపోహాలు అవసరం లేదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేయడం దారుణంగా పేర్కొన్నారు. తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. తమను ప్రశ్నించే హక్కు ఆ రెండూ పార్టీలకు లేదని తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై మరోమారు విమర్శలు గుప్పించారు.
Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హామీల అమలుపై ఎలాంటి అపోహాలు అవసరం లేదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేయడం దారుణంగా పేర్కొన్నారు. తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. తమను ప్రశ్నించే హక్కు ఆ రెండూ పార్టీలకు లేదని తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై మరోమారు విమర్శలు గుప్పించారు.
Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం
'తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయడాన్ని బీఆర్ఎస్ అడ్డుకోకుండా మరింత ప్రోత్సహించింది' అని ఆరోపించారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. 'తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఏడాదికి రూ.6 వేల కోట్లు అప్పులు చెల్లించేది. ఇప్పుడు రూ.70వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది' అని వివరించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దివాళా తీయించారని ఆరోపించారు.
Also Read: No Electricity Bill: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. మార్చి నెల కరెంట్ బిల్లు కట్టనవసరం లేదు
'ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా ప్రతీ నెలా మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు' రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 31వ తేదీలోగా రైతు బంధు ఇస్తామని చెబుతున్నా బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అబద్దాలు చెబుతున్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో '60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం' అని మరోసారి పునరుద్ఘాటించారు. నిర్లక్ష్య ధోరణితో బీఆరెస్ గాలికి వదిలేస్తే తాము నియామకాలు చేపట్టినట్లు వివరించారు. మార్చి 2వ తేదీన మరో 6 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. 'మీరు ఎక్కడికక్కడ వదిలేసిన సంసారాన్ని మేం చక్కదిద్దుతున్నాం' అని తెలిపారు.
'మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది అంటుంటే.. మేడిగడ్డలో నీళ్లు అన్నారంలో పోయాలని హరీశ్ రావు అంటున్నారు. హరీష్ మెదడు ఉండి మాట్లాడుతున్నారా? ఎలా కుంగిపోయిందో సమాధానం చెప్పరు.. చూసొద్దామంటే రారు' అని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాలపై వాళ్లు మళ్లీ అవే అబద్దాలు చెబుతున్నారని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 'బీఆర్ఎస్, బీజేపీలకు సవాలు విసురుతున్నా. మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో.. 2023లో మా ఆరు గ్యారెంటీల హామీలపై ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చిద్దాం. దీనికి బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమా?' అని ప్రశ్నించారు.
బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 'మూడోసారి మోదీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా?' అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే నిధులు తెచ్చారా? అని కడిగి పారేశారు. కిషన్ రెడ్డికి, కేసీఆర్‌కు తేడా ఏం లేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ పథకాలను రేపు (మంగళవారం) ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
'గ్యారంటీల అమలు నిరంతర ప్రక్రియ.. అర్హులు ఎప్పుడైనా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దు' అని స్పష్టం చేశారు. బాధ్యత లేకుండా బీజేపీ, బీఆర్ఎస్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ కాంక్షతో ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురాశ తప్ప బీజేపీ, బీఆర్ఎస్కు వేరే ఆలోచన లేదని తెలిపారు. తమను ప్రశ్నించే హక్కు ఆ రెండు పార్టీలకు లేదని రేవంత్ రెడ్డి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి