Harish Rao: మాజీ సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు
Revanth Reddy Not Enough KCR Foot Finger Nail: తన పుట్టినరోజే రేవంత్ రెడ్డి అత్యంత హేయంగా మాట్లాడాడని.. అతడు కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఉందా? అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు అని మండిపడ్డారు.
Revanth Reddy Vulgar Comments: తప్పు మీద తప్పు చేసి వదరబోతులా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని.. ముఖ్యమంత్రి స్థాయికి దిగిజారి మాట్లాడుతున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని దేశం ఎప్పుడూ చూసి ఉండదని పేర్కొన్నారు. బ్యాగులు మోసి.. బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు. అలాంటి రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు అని తెలిపారు.
Also Read: Musi Yatra: రేవంత్ రెడ్డి మూసీ యాత్రలో అపశ్రుతి.. బొక్కబోర్లా పడిన ఫొటోగ్రాఫర్లు
మూసీ ప్రాజెక్టుకు మద్దతు కూడా గట్టే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన యాత్రలో రేవంత్ రెడ్డి అత్యంత దారుణంగా మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతోపాటు ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్టు విరుచుకుపడ్డారు. అతడు చేసిన ప్రసంగంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ మాజీ మంత్రి హరీశ్ రావు 'ఎక్స్' వేదికగా స్పందించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డిని శునకంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా సుమతీ శతకంలోని 'కనకపు సింహానమున శునకం కూర్చుండబెట్టి' అనే పద్యాన్ని గుర్తు చేశారు.
Also Read: Yadadri: యాదాద్రి ఆలయానికి రేవంత్ రెడ్డి శుభవార్త.. టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుకు నిర్ణయం
'కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి'నట్టు రేవంత్ రెడ్డి తీరు ఉంది. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు' అని హరీశ్ రావు ఘాటు విమర్శలు చేశారు. 'తప్పు మీద తప్పు చేసి వదరబోతులా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. పుట్టిన రోజున తండ్రి వయసున్న కేసీఆర్ మీద.. తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి మీద నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం' అని మండిపడ్డారు.
'వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని దేశం ఎప్పుడూ చూసి ఉండదు. మూసీ నీళ్ల మురికితో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ వంకర బుద్ధి ఇక మారదు' అని రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. నీ లాగా చిల్లరగా మేము మాట్లాడలేమని.. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో నడిపిన గంభీరమైన చరిత్ర మాది అని గుర్తు చేసుకున్నారు. 'బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర నీది' అంటూ ఓటుకు నోటు కేసును గుర్తు చేశారు. 'రేవంత్ రెడ్డి దోపిడీ.. దొంగబుద్ధిని నిరూపించి ప్రజా క్షేత్రంలోనే బుద్ధి చెబతాం' అని స్పష్టం చేశారు. పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని.. నిరంకుశత్వం మాని నిర్మాణాత్మక నిర్ణయాలపై శ్రద్ద వహించాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి