Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణ
Revanth Reddy Back Step Gautam Adani Rs 100 Cr Donation: గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.
Gautam Adani Rs 100 Cr Donation: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన గౌతమ్ అదానీ కంపెనీ వ్యవహారంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు ఇచ్చిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరించారు. ఆ డబ్బులను తీసుకోవడం లేదని చెబుతూ లేఖ రాసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అనవసర వివాదం జోలికి వెళ్లకూడదనే నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు.
ఇది చదవండి: Harish Rao అబద్ధాల్లో రేవంత్ రెడ్డి ఓ డాక్టర్.. మహారాష్ట్ర ప్రజలు గట్టి బుద్ది చెప్పారు
న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై సోమవారం చర్చించిన అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ వ్యవహారంపై కీలక ప్రకటన చేశారు. 'గౌతమ్ అదానీ అంశంపై ఇప్పటికే చెప్పాను. అయినా ఆరోపణలు చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. యంగ్ ఇండియా పథకంలో రూ.100 కోట్లు నాకు చేరాయని చెబుతున్నారు. వివాదాల నేపథ్యంలో రూ.100 కోట్లను స్కిల్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దని వారికి లేఖ రాశాం' అని వివరించారు.
ఇది చదవండి: KTR vs Revanth: మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ జీవితం లేకుండా చేస్తాం: కేటీఆర్ హెచ్చరిక
రేవంత్ ప్రకటనలో ముఖ్యాంశాలు
- సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పథకానికి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపయోగపడేది.
- ఢిల్లీ పర్యటనకు మంత్రి వర్గ విస్తరణకు సంబంధం లేదు
- ఓం బిర్లా కుమార్తె వివాహం కోసం ఢిల్లీకి వచ్చాం.
- వివిధ శాఖల పనులు పెండింగ్ ఉండడంతో కేంద్ర మంత్రులను కలుస్తాం
- ఫెడరల్ దేశం కాబట్టి రాష్ట్రాలకు రావాలసిన నిధులు రాబట్టుకోవడానికి ఎన్నిసార్లు అయినా వెళ్తాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter