KTR Brother In Law Party: కేటీఆర్‌ బావ మరిది ఇంట్లో జరిగిన కుటుంబ పార్టీపై పోలీసులు చేసిన హంగామా, హడావుడిపై తొలిసారి రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరియా పర్యటనకు వెళ్లి వచ్చిన మీడియా బృందంతో ఆయన చేసిన చిట్‌చాట్‌లో హాట్‌ కామెంట్స్‌ చేశారు. 'మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు' అని పేర్కొన్నారు. దీపావళి పండుగ అలా చేసుకుంటారని తనకు తెలియదని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Renamed: రేవంత్ రెడ్డికి కొత్త పేరు పెట్టిన మాజీ మంత్రి హరీశ్ రావు.. ఏం పేరు తెలుసా?


'దీపావళి దావత్ అలా చేస్తారు అని మాకు తెలియదు. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు. ఇంటి దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయి?' అని మీడియా బృందం చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ అడ్డుకున్నా తాను ఆ ప్రాజెక్టు చేసి తీరుతానని స్పష్టం చేశారు.

Also Read: KTR Celebrations: దీపావళి వేళ సంబరాలకు కేటీఆర్ పిలుపు.. ఎందుకు? ఏం సాధించారో తెలుసా?


మూసీపై తగ్గేదే లేదు
'ఎవరూ ఎంత అడ్డుకున్నా మూసీ పునరుజ్జివం చేసి తీరుతా' అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మొదటి ఫేజ్‌ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తాం. గండిపేట, హిమాయత్ సాగర్‌ నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేజ్‌ పనులు చేపడతాం. నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తాం' అని చిట్‌చాట్‌లో రేవంత్‌ తెలిపారు. ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. 


'బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతాం. అక్కడ అభివృద్ధి కోసం సైన్యం భూమి కూడా ఆడిగాం' అని మీడియా బృందంతో రేవంత్‌ తెలిపారు. 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామని.. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తాం' అని వారితో పంచుకున్నారు. మూసీ వెంట అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, గాంధీ ఐడియాలజీ కేంద్రం, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం' అని తన ఆలోచనలు మీడియా వారికి వివరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook