Revanth Reddy: ఉద్యమకారులను వేధిస్తూ.. సమైక్యవాదులతో ములాఖత్! కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్..
Revanth Reddy on KCR: సీఎం కేసీఆర్ పై ఒంటికాలిపై లేచే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎం కేసీఆర్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమావేశంపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy on KCR: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం కేసీఆర్ పై ఒంటికాలిపై లేచే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎం కేసీఆర్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమావేశంపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు రేవంత్ రెడ్డి. పక్కా సమైక్యవాదితో కేసీఆర్ ములాఖత్ అయ్యారంటూ మండిపడ్డారు.
కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి పడ్డారని రేవంత్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర సిద్దాంతం కోసం పోరాడిన ఉండవల్లిపై గౌరవం ఉండేదని.. కేసీఆర్ పంచన చేరి ఆయన ఉండవల్లి భజన చేయడంతో.. అ గౌరవం పోయిందన్నారు. ఉండవల్లి చెబుతున్నట్లు బీజేపీపై కేసీఆర్ పోరాడితే... టీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారని కామెంట్ చేశారు. రాష్ట్ర విభజన పై రెండు పుస్తకాలు రాసిన ఉండవల్లి.. అందులో తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టారని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన జైపాల్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ ను వ్యక్తిగతంగా విమర్శించిన ఉండవల్లిని కేసీఆర్ ఇంటికి పిలుపించుకుని మాట్లాడారని విమర్శించారు.
సార పాతదే..సీస కొత్తది అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ పక్కన ఉన్న వాల్లంతా బీహారీలే అన్నారు. కేసీఆర్ కొత్తగా పెట్టబోయే పార్టీకి బీహార్ రాష్ట్ర సమితి అని పెట్టుకుంటే సరిపోతుందన్నారు. అడ్డామీద కూలిగా మారి కేసీఆర్ తో కలవద్దని ఉండవల్లికి సూచించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు.తెలంగాణ ఉద్యమకారులను తరిమేసిన కేసీఆర్.. ఇప్పుడు సమైక్యవాదులతో ములాఖత్ అయ్యారని చెప్పారు. కేసీఆర్ తీరును తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని.. తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
Read also: KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీలోకి సోను సూద్, ప్రకాష్ రాజ్! పీకేకు ఉత్తరాది బాధ్యతలు.. ?
Read also: Sonu Sood On Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై సోను సూద్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి