Revanth Reddy Slams KCR: 35 వేల కోట్లు దోచిన గజదొంగ కేసీఆర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్ అని.. ఈ గజదొంగను జైళ్లలో పెట్టాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయితీలన్నీ ఆర్థికంగా నిర్వీర్యమయ్యాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
Revanth Reddy Slams KCR: పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయితీలకు నిధులు, విధులను కేటాయించింది. రాజీవ్ గాంధీ హయాంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయితీలకు నేరుగా నిధులిచ్చి ఆ నిధులను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసే సర్వాధికారాలను సర్పంచులకు ఇచ్చారు. కానీ కేసీఆర్ ఆ స్ఫూర్తిని మరిచి పంచాయితీరాజ్ సంస్థలను నాశనం చేస్తున్నాడు. గ్రామ పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది. నెలనెలా పంచాయితీలకు చెల్లించాల్సిన వందలాది కోట్ల నిధులను ఇవ్వకుండా మరోవైపు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయాల 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయితీలకు చేరకుండా ఈ ప్రభుత్వం కొల్లగొట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్ అని.. ఈ గజదొంగను జైళ్లలో పెట్టాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులను కేసీఆర్ దుర్వినియోగం చేస్తోంటే.. ఈ అంశం మీద విచారణ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సర్పంచ్‌లకు నిధుల విడుదల, ప్రభుత్వ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన క్రమంలో సోమవారం ధర్నా చౌక్‌కు వెళ్లబోతున్న రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల చేసిన అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయితీలన్నీ ఆర్థికంగా నిర్వీర్యమయ్యాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితికి పంచాయితీలు చేరుకున్నాయి. తండాలను పంచాయతీలు చేశానని గొప్పలు చెబుతున్న కేసీఆర్.. ఏ తండాలోనైనా గ్రామ పంచాయితీల కోసం పక్కా భవనాలు ఎందుకు కట్టించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాల్లో సశ్మానవాటిక, పల్లె ప్రకృతివనం తదితర పనుల కోసం సర్పంచులు సొంత నిధులతో పనులు చేపట్టారు. వాటి నిర్మాణం కోసం ఖర్చు చేసిన బిల్లులు రాకపోవడంతో సర్పంచులు సైతం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి తలెత్తింది అని అన్నారు.
అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు వెచ్చించి పనులు చేసిన సర్పంచులు పడుతున్న కష్టనష్టాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలోనే ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మునుగోడులో సర్పంచ్ ఆర్టీసీ బస్టాండులో బిచ్చమెత్తుకున్నాడు. సూర్యాపేట జిల్లాలో శాంతమ్మ అనే మహిళా సర్పంచ్ తాళి అమ్ముకుని అప్పులు కట్టుకోవాల్సి వచ్చింది. అలా సర్పంచులకు ఇవ్వాల్సిన రూ.35 వేల కోట్ల పంచాయితీ నిధులను సర్పంచులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన మెగా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ వంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది " అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బడాబడా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ తీసుకుంటుంది కనుకే కేసీఆర్ కుటుంబం ఈ పని చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : Bandi Sanjay: హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్స్: బండి సంజయ్
ఇది కూడా చదవండి : Liquor Sales: కాసుల వర్షం కురిపించిన మందుబాబులు.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో లిక్కర్ సేల్స్
ఇది కూడా చదవండి : TS SI Constable Main Exam Dates: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. మెయిన్ ఎగ్జామ్స్ తేదీలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook