Telangana Floods: భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ విలవిలలాడిందని.. ప్రకృతి విపత్తుతో రూ.5 వేల కోట్లకు పైగా నష్టం సంభవించిందని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భారీగా సహాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వరద పరిశీలన కోసం వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి  శివరాజ్ సింగ్ చౌహన్‌కు వరద నష్టంపై వివరణ ఇచ్చారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TPCC President: తలపండిన కాంగ్రెస్‌ నాయకులకు షాక్‌.. పంతం నెగ్గించుకున్న రేవంత్‌ రెడ్డి


 


రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి చౌహన్‌కు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని  ప్రాథమికంగా  అంచనా వేసినట్లు తెలిపారు. అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలు సేకరిస్తున్నాయని, సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.


Also Read: Flood Relief: ఆపదలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఆపన్నహస్తం.. కేంద్రం భారీ సహాయం

వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన అనంతరం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్‌ హైదరాబాద్‌లోని సచివాలయం చేరుకున్నారు. వారితో సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు సమావేశమై వరద నష్టం వివరించారు. ఖమ్మం, మహబూబ్‌​నగర్​, సూర్యాపేటతో పాటు పలు  జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి అకాల నష్టం సంభవించిందని కేంద్ర మంత్రులకు రాష్ట్ర అధికార యంత్రాంగం తెలిపింది. ఒకే రోజులో అంచనాకు మించిన వర్షం పడటంతో రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు చాలాచోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ విషయమై ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు సమానంగా వరద సహాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాగా అంతకుముందు ఉదయం కేంద్ర మంత్రులు చౌహన్, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter