KTR Vs Revanth Reddy: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై పూర్తి దృష్టి సారించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. పాలనలో మూడు నెలలు బిజీబిజీగా గడిపిన ఆయన ప్రస్తుతం పూర్తి దృష్టి రాజకీయాలపై పెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జైల్లో చిప్పకూడు తింటాడని హెచ్చరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌


 


గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌తో దుర్మార్గం చేసింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌తో నాటి సీఎం కేసీఆర్‌ మంది సంసారాల్లో వేలు పెట్టాడు. కొంత మంది ఫోన్లు విన్నామని కేటీఆర్‌ చెబుతున్నాడు. ఫోన్లు వినేందుకు వాళ్లకేం పని' అని ప్రశ్నించారు. కేసీఆర్‌ చెప్పినట్టు విన్న కొంతమంది అధికారులు జైలు పాలయ్యారు. ఇప్పుడు కేటీఆర్‌ కూడా అదే గతి పడుతుంది' అని హెచ్చరించారు. కేటీఆర్‌ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని తగిన ఫలితం ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందని తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఏకమయ్యాయని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలవనున్నారని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్‌ సంచలన సవాల్‌


 


వాల్మికీ, బోయలను ఆదుకుంటామని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రకటన నియమావళి ముగిసిన వెంటనే వాల్మికీ, బోయల డిమాండ్‌లు నెరవేరుస్తాం. ఎవరు ఏ సమస్యతో వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటించారు. అందరూ కాంగ్రెస్‌ పార్టీ వైపు రావాలని రాజకీయ నాయకులకు పిలుపునిచ్చారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణపై తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఆమె ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు అరుణ జాతీయ హోదా తీసుకురావొచ్చు కదా అని హితవు పలికారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ తీసుకురారు కానీ జాతీయ పదవి మాత్రం తెచ్చుకున్నారని విమర్శించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook